స్నేహానికి మైత్రికి లింగ భేదం ఉండదు వయోభేదాన్ని లెక్కించరు. ఇతరూ పురుషులై ఉండవచ్చు లేక ఇద్దరు స్త్రీ లై ఉండవచ్చు. ఒకరు స్త్రీ మరొకరు పురుషుడై ఉండవచ్చు మనసులు కలిసి ఆలోచనలు ఒకటై మంచి కార్యాలు సమాజం కోసం చేయాలన్న ఆలోచన కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిస్తే అది మైత్రి క్షణిక అవసరాల కోసం హోటల్ వెళ్లి కాఫీ తాగడం ఒక సినిమాకు వెళ్లి రావడం సాయంత్రం కాసేపు షికారు చేయడం లాంటి వాటికి స్నేహితుడు కావాలి మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే వాడు స్నేహితుడు బుద్ధిని పరిపక్వాన్ని చేయడానికి ప్రయత్నించేవాడు మిత్రుడు కవితలు రాయడంలో గాని రచనలు సృష్టించడంలో కానీ తనకలానికి బలాన్నిస్తూ చక్కటి సలహాలు ఆ రచన బాగు కోసం చేసేవాడు మిత్రుడు. నాకు అనుకోకుండా ఊహించని వ్యక్తి కలవడం ఒకరిని ఒకరు గౌరవించుకోవడంతో ప్రారంభమైంది పరిచయం వ్యక్తి రంగులు చూసి ఎవరు గుర్తించరు తెల్లటి తెలుపు ఉన్నా చూడడానికి ఆకర్షణ కలిగించదు అక్కడ రంగు కాదు ముఖ్యం కారు నలుపులో నేరేడు పండులా ఉన్న అమ్మాయి కూడా చక్కటి చిరునవ్వుతో ఆకర్షణీయంగా ఉండవచ్చు నిజానికి పైపై ఆకర్షణలకు మనసు మనసు పడితే అది స్నేహానికి ఎక్కువ కాలం నిలిచేది కాదు భగవద్గీతలో కూడా వ్యక్తిత్వాన్ని మతానికి కులానికి వర్గానికి వర్ణానికి ముడి పెట్టకుండా గుణానికి మాత్రమే ప్రాధాన్యత కలిగించడానికి కారణం మనసు అకారణ కోపం వచ్చి స్నేహితుల మధ్య తగాదా ప్రారంభమైనా ఉత్తమస్య క్షణం కోపం ఉత్తములలో కోపం క్షణకాలంలో మాయమైపోతుంది అన్న పెద్దల సూక్తిని అనుసరించి మరుక్షణంలోనే కలిసేది మైత్రి
మనసులో పేరుకుపోయిన మలినాలను తొలగించే వ్యక్తి మిత్రునిగా చెప్పుకోబడతాడు దానితో మన అహంకారం తగ్గిపోతుంది ఆరోగ్యమైన పరిస్థితులు నెలకొంటాయి చామన సాయలో ఉన్నా అనుక్షణం చిరునవ్వుతో కదిలే మిత్రురాలు కలవడం శుభ సూచకం ఒకరిని గురించి మరొకరు పూర్తిగా వారి భావాలను అర్థం చేసుకొని తన భావాలను పోలుస్తూ కలిసి ఉండడం మైత్రి శ్రీకృష్ణ పరమాత్మ స్నేహితులు ఎంతమంది ఉన్నారు చిన్నప్పుడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి రేపు మరణానికి సిద్ధమైన వాడి వరకు ప్రతివాడు స్నేహితుడిగా తన కు కానీ శ్రీరామచంద్రమూర్తికి గుహుడు ఒక్కడే మిత్రుడు ప్రాణానికి ప్రాణంగా ఉండే వ్యక్తుల తత్వం అలా ఉంటుంది నా మిత్రురాలు కూడా స్వాతిముత్యంగా స్వచ్ఛ మనసుతో ఉండడం నాకు నచ్చిన లక్షణం అందుకే నిత్యం ఆమె కోసం ఎదురుచూపులు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి