కల్యాణ గీతాలు.;- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .9884429899.

 వివాహం కుటుంబాన్ని ఏర్పరుస్తుంది.కుటుంబం సాంస్క్రతిక జీవనమార్గానికి తొలి మజిలి.కుటుంబం ఏర్పడటం ప్రారంభించింది అంటే  ఆజాతి నాగరికత వృధ్ధిలోనికి వస్తుందని అర్ధం.సమాజం యొక్క అతిసూక్ష్మరూపం కుటుంబం.ఆర్ధిక,పాలనాదివంటి ఏన్నో కలగలసిన వివాహం కుటుంబాన్ని,తద్వారా ఒక జాతి చరిత్రను నిర్మిస్తుంది.
వివాహ సమయంలో జరిగే వైదిక క్రియలను దృష్టిలో పెట్టుకొని, పరిణయం,ఉద్వాహం,కల్యాణం,పాణిగ్రహణం, పాణీపీడన, పాణీబంధం, దారోపసంగ్రహణం,దారపరిగ్రహణం,దారకర్మ,దారక్రియ,పెండ్లి,అనేపదాలను వివాహానికి పర్యాయ పదాలుగా నిర్ణయించారు.
వివాహ వ్యవస్ధ ఏర్పడిన నాటి నుండి అందులో ఎన్నోమార్పులు చేర్పులు వస్తూనే ఉన్నాయి.వివాహాన్ని మను ధర్మశాస్త్రంలో ఎనిమిది రకాలుగా వర్ణంచారు.అవి....
1)బ్రహ్మం.2)దైవం.3)ఆర్షం.4)ప్రాజాపత్యం.5)గాంధర్వం.6)రాక్షసం.
7)ఆసురం.8)పైశాచం.
1)బ్రహ్మం-అంటే,శుభలక్షణాలుఉన్నబ్రహ్మచారిని ఆదరంగా ఆహ్వానించి,కన్యాదానం చేయడం.2)దైవం-అంటే,యజ్ఞంలో ఋత్విక్కుగా పాల్గోటుంన్నవెక్తికి కన్యను అలంకరించి వివాహం జరిపించుట.3)ఆర్షం-అంటే,వరుని వద్ద నుండి రెండు పాడి ఆవులు తీసుకుని తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించటం.
4) ప్రజాపత్యం-అంటే,ఎప్పటి నుండో కలసిమెలసి ఉండి గృహస్ధశ్రమ ధర్మలను చక్కగా నిర్వహించండి అని ప్రతిజ్ఞ చేయించి వివాహం జరిపించుట.5)ఆసురం-అంటే,కన్యాదానం చేసినందుకు ప్రతిఫలంగా అల్లుని వద్ద కన్యాసుల్కం తీసుకుని వివాహం జరిపించడం. 6) గాంధర్వం-అంటే,యువతి,యువకుడు పరస్పరం ఇష్టపడి పెద్దలకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకోవడం. 7)రాక్షసం-అంటే,కన్యతరపు వారితో యుద్ధం చేసి,కన్యను అపహరించి వివాహం చేసుకొనుట.8)పైశాచికం-అంటే,మనసుపడిన కన్యను మోసగించి, లేక బలత్కరించి,నిద్రిస్తున్నసమయంలో వివాహం చేసుకోవడం.
గతంలో ఐదు రోజుల పెండ్లిళ్లు జరుగుతుండేవి.మొదటిరోజు కార్యక్రమాన్ని 'వరప్రేషణం ' అంటే లగ్నపత్రిక పంపటం,వచ్చిన వారిని ఊరి పొలిమేరల నుండి  విడిదికి మేళతాళాలతో ఆహ్వానించడం. ' సిమంతపూజ' దీనినేనేడు 'ఎదురుకోల' స్వాగత, సత్కారాలతో ఆహ్వానించడం. రెండోరోజు ' ఇరువర్గాల వారు వంశ వృక్షాలను వారి పూర్వికుల గోప్పదనాలను వివరించుకుని,వరునికి గోదానం చేస్తారు.మూడవ రోజు ఇరువర్గాల వారు శక్తికొద్ది దానం చేస్తారు.నాలుగువ రోజు నిష్క్రమణం అలంకరించిన వేదికపై కల్యాణం జరుపుతారు.ఐదవ రోజు దాస,దాసిలతో,స్త్రీధనంతో వధువు వరుని యింటికి తరలి వెళ్లడం.ఈవివాహా వేడుకలలో వరుని కాళ్లు వధువు తండ్రి కడగడానికి అర్ధం వరుడు శ్రీమహావిష్ణువుగా భావించడం.
ధర్మేచ..అర్ధచ..కామేచ..నాతిచరామి..అని వరునితో కన్యాదాత ప్రతిజ్ఞ చేయిస్తాడు.కల్యాణ వేదికపై తెర తొలిగించి వధూవరులు ఒకరిని ఒకరు చూసుకునే సమయాన్ని ' సమీక్షణం ' లేక 
' నిరిక్షణ ' జిలకర్ర,బెల్లం బ్రహ్మరంధ్రంపై ఉంచడం శుభ ముహార్తానికి నాంది.' మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా  కంఠే బధ్నామి సుభగే  త్వం జీవశరదాం శతమ్ ' వధూ వరులు వేసే ప్రతి అడుగుకు ఓప్రాధాన్యత ఉంది.' ఏకమిషే విష్ణుస్త్వా అన్వేతు, ద్వేఊర్జే విష్ణుస్త్వా అన్వేతు...' వధూ వరుడు వేసే ఏడు అడుగులలో మొదటి అడుగు ఆహారాన్ని,రెండవ అడుగు బలాన్ని,మూడవ అడుగు శుభకార్యాలను,నాల్గవ అడుగు వల్ల సౌఖ్యాన్ని,ఐదవ అడుగువల్ల పశు సంపదను,ఆరవ అడుగు వలన ఋతు సంబంధాలను ,ఏడవ అడుగు వలన ఏడుగురు హాతలను అనుగ్రహించాలని వేడుకుంటారు. ఈవివాహ వ్యవస్ధలో అనేక కులాల వారిగా పలు సంప్రదాయాలు ఉన్నాయి.
మనసినిమాల్లో పెళ్లిపాటలు చూద్దాం! ...
పెళ్లిరోజు చిత్రంలో ' పెళ్లి వార మండి '  మీనా చిత్రంలో ' పెళ్లంటే నూరేళ్ల పంట' సీతా రామ కళ్యాణం లో  ' టైటిల్ '  సాంగ్.రక్త సంబంధంలో ' బంగారు బోమ్మ రావేమే ' ప్రతిజ్ఞా పాలన లో ' అందాల రాజు వస్తాడు ' ముత్యాల పల్లకి లో ' సన్నాజాజికి గున్నామావికి ' సుమంగళి లో ' కొత్త పెళ్లికూతురా రా రా' ఆత్మీయులు లో ' కళ్లలో పెళ్లి పందిరి ' ప్రేమ లేఖలులో ' పందిట్లో పెళ్లవుతున్నాది ' అడవి రాముడు ' కోకిలమ్మ పెళ్లికి ' పెళ్లిపుస్తకం లో టైటి ల్ .ఇటువంటి వందల కల్యాణ గీతాలు వచ్చాయి మనందరిని మురిపించి, మైమరిపించాయి.

కామెంట్‌లు