జీవితమే సాగరము
సహజమేనోయ్ ఆటుపోట్లు
సుఖదుఃఖాల సంగమము
శ్రుతి తప్పిన అగచాట్లు
సుతిమెత్తని జీవితము
పరిమళించే పూవులు
సున్నితమైన అద్దము
జారిపోతే ముక్కలు
అందమైన జీవితాన్ని
చేసుకోకు వికారము
భగవంతుని బహుమానము
చేసుకొనాలి సార్ధకము
కాదు కాదు పంజరము
అక్షరాల తూణీరము
శ్రేష్టమైనది జీవితము
కాకూడదది శిథిలము
జీవితానికొక అర్ధము
గొప్పదైన పరమార్ధము
ఉండాలోయ్! మానవా!!
చరిత్ర పుటలలో స్థానము
ముద్దులొలికే కుటీరము
మనసు దోచు కాసారము
అమూల్యమైన జీవితము
చేరాలి విజయ తీరము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి