పిల్లలు సిరిమల్లెలు;- -గద్వాల సోమన్న, 9966414580
పూలలాంటి పిల్లలు
పాలవెల్లి వెలుగులు
బాలల మాటలేమో
ఈలపాట తీపులు

తేనె వంటి మనసులు
వీణ తీగ పలుకులు
ప్రాణమిచ్చు కూనలు
వాన చినుకు కులుకులు

కరుణాంతరంగులు
మరుమల్లెల తావులు
చిరుదరహాస సొగసులు
హరివిల్లుల రంగులు

గంతులేయు లేగలు
చింత లేని ఖగములు
వింత వింత పనులతో
అందమైన బాలలు

ప్రగతికిల సారథులు
జగతిలో వారథులు
పగలు,పంతాలు లేని
నగమోముల పిల్లలు

తరువుల్లో ఫలములు
గురుదేవుల శిష్యులు
అరుణ కిరణాలు వలె
పరుగుదీయు బాలలు


కామెంట్‌లు