విలువైనవి 'పుస్తకాలు"- -గద్వాల సోమన్న,9966414580
పుస్తకాలు చదివితే 
మస్తకాలు వికసిస్తాయి
హస్తభూషణం మనిషికి
నేస్తమై అలరిస్తాయి

ఎన్నెన్నో విషయాలు
వెన్నెలై కురిస్తాయి
కన్నవారి రీతిలో
మిన్నగా తోడుంటాయి

శ్రద్ధగా ఇల పఠిస్తే
బుద్ధులు దిద్దుతాయి
హద్దు మీరు కుండా  అవి
అద్దములా నిలుస్తాయి

విజ్ఞాన కాగడాలు
వినోదాల కేంద్రాలు
విలువైనవి పుస్తకాలు
వెలిగించును జీవితాలు

కామెంట్‌లు