పెద్దలను గౌరవిస్తే
దీవెనలే మెండుగా
కొండ వోలె ఉంటాయి
బ్రతుకంతా అండగా
పెద్ద వారి బాటలోన
పయనిస్తే బహు క్షేమము
వారు చెప్పు మాటలోన
దాగుండును ఆనందము
అనుభవాల ఆనవాలు
వృద్ధులే లోకంలో
వారుంటే చాలు చాలు
కుటుంబాన మేలు మేలు
చిన్నారుల నేస్తాలు
వయసు మీరిన పెద్దలు
రాను రాను అవుతారు
స్వభావంలో పసి పిల్లలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి