ఉద్దీపన గీతిక- -గద్వాల సోమన్న,9966414580
నీలి మబ్బు తేరులో
జాబిలిని చేరుదామా!
గలగల పారు యేరులో
జలకాలాడుదామా!

సరదాల  కారులో
షికారు చేసేద్దామా!
ఉప్పొంగే హోరులో
తేలి తేలి పోదామా!

ఉత్కంఠ పోరులో
విజయాలే చూద్దామా!
అపలేని జోరులో
ఆనందం పంచుదామా!

తల్లిలాంటి ఊరిలో
మల్లె వోలె ఉందుమా!
తిరుగులేని తీరులో
మంచి పేరు పొందుదామా!


కామెంట్‌లు