అందము! అందము!!;- -గద్వాల సోమన్న,9966414580
మింటికి అందము తారలు
కంటికి అందము రెప్పలు
చంటి పిల్లలు నిజముగా
ఇంటిలో  మేలి సొగసులు

ముఖముకు అందము నగవులు
కొలనుకు అందము కలువలు
మనిషికి అందము విలువలు
తనువుకు అందము వలవలు

తోటకు అందము పూవులు
పాటకు అందము పదములు
కోటకు అందము రాజులు
బాటకు అందము తరువులు

ఏటికి అందము జలములు
నోటికి అందము పెదవులు
పొలముకు అందము పైరులు
పురముకు అందము పౌరులు

కవులకు అందము కలములు
గృహముకు అందము వనితలు
గుడిలో అందము గంటలు
బడిలో అందము బాలలు

తాతకు అందము దగ్గులు
పాపకు అందము బుగ్గలు
మొక్కకు అందము మొగ్గలు
ముంగిట అందము  ముగ్గులు


కామెంట్‌లు