చీకట్లు తరిమి తరిమి
వెలుగుపూలు రువ్వి రువ్వి
విశ్వానికి ఉపకరించు
'సూర్యచంద్రులు' గౌరవం
బాగోగులు చూసి చూసి
త్యాగాలు చేసి చేసి
కంటికి రెప్పలా కాచు
'తల్లిదండ్రులు' గౌరవం
ప్రేమ ధార పంచి పంచి
చెలిమి కలిమి పెంచి పెంచి
ఆపదలో తోడుండే
'స్నేహితులే' గౌరవం
అల్లరితో అలరించు
మాటలతో మురిపించు
కల్లా కపటమెరుగని
'పసి పిల్లలు' గౌరవం
విజ్ఞానం పంచి పెట్టి
అజ్ఞానం తుడిచి పెట్టి
విద్య విలువ నేర్పే
'గురుదేవులు' గౌరవం
మన ఇష్టాలు తీర్చి తీర్చి
క్రొవ్వొత్తిలా కరిగి కరిగి
కుటుంబాన్ని వెలిగించే
'కన్నవారు' గౌరవం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి