శ్రేష్టమైనది జ్ఞానము
కలుగజేయును గౌరవము
జీవితంలో జీవము
అన్నింటిలో అమూల్యము
అభివృద్ధికి ఆధారము
సమస్యలకు పరిష్కారము
చక్కబెట్టును పరిస్థితులు
మార్చివేయును స్థితిగతులు
జ్ఞానం లాభదాయకము
బ్రతుకులో స్వర్గధామము
కల్పిస్తుంది అవకాశము
ఎక్కిస్తుంది అందలము
తెలుపుతుంది మర్మాలను
కదిలిస్తుంది హృదయాలను
జ్ఞానమెంతో బలమైనది
సంపద కన్నా విలువైనది
చేస్తుంది మహనీయులు
చేయిస్తుంది గొప్ప పనులు
ఘనతకు మూలం జ్ఞానము
పెంచుతుంది మనోధైర్యము
జ్ఞానము కాంతి రూపము
జీవితాల్లో మణి దీపము
భగవంతుని ప్రతిబింబము
జ్ఞానము లేకున్న శూన్యము
జ్ఞానముంటేనే క్షేమము
బ్రతుకులగును సుభిక్షము
జ్ఞానంతో అన్ని సాధ్యము
ఎదుగులకు ఏకైక మార్గము
అపారమైనది జ్ఞానము
అది లేక అంధకారము
జ్ఞాన సాధన చేసుకొనుము
ఉన్నతికి చేరుకోనుము
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి