పాఠశాల తోటలోన
పరిమళించే కుసుమాలు
అక్షరాల బాటలోన
సాగిపోవు చిన్నారులు
చదువులమ్మ ఒడిలోన
ఆడుకొనును పసి పిల్లలు
గుడిని బోలిన బడిలోన
చదువుకొనును సంపన్నులు
గురుదేవుల సన్నిధిలో
విద్యనొందు విద్యార్థులు
జ్ఞానమనే వెన్నెల్లో
విహరించే కపోతాలు
సమ సమాజ స్థాపనకు
సిద్ధమయ్యే బాలలు
అజ్ఞానం తరిమికొట్టు
విజ్ఞాన కాగడాలు
అల్లరితో అలరించే
మల్లెపూల పరిమళాలు
ఎల్లరికి ఇష్టమయ్యే
పిల్లలంటే వేల్పులు
పాఠశాల గగనంలో
ప్రకాశించే తారకలు
మమకారపు సదనంలో
ముద్దులొలికె చంద్రికలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి