సమైక్యతే ముద్దు ముద్దు;- -గద్వాల సోమన్న,9966414580
మంచివి కావు జగడాలు
ముంచి వేయు జీవితాలు
స్నేహ బంధం పగడాలు
పరిమళించే హారాలు

అందరితో సమాధానం
అసలుసిసలు బహుమానం
మానవత్వానికి భువిని
లేదు కదా కొలమానం

క్షమాగుణం బంగారం
జీవితాన సింగారం
అదే గనుక  శూన్యమైతే
మనుగడే అంధకారం

జగడాలే వద్దు వద్దు
సమైక్యతే ముద్దు ముద్దు
విశ్వ మానవ ప్రేమతో
సాగుటయే సరిహద్దు

బంధాలు చెడిపోరాదు
కకావికలం కారాదు
వసుధైక కుటుంబమై
ఉండాలోయ్  ఏకమై

జగడాలు మితిమీరితే
మనశ్శాంతి కరువు కరువు
ఇంటాబయట యుద్ధమే!
పగలు,పంతాలు సిద్ధమే!

కామెంట్‌లు