దీపావళి పండుగ;- -గద్వాల సోమన్న,9966414580
దీపావళి వేడుక
ఖరీదైన కానుక
చీకట్లు తొలగించు
జీవితాల్లో దీపిక

దీపాల కాంతిలో
శుభములే బ్రతుకులో
దుర్గుణాల  నరకాసుర
వధ జరగాలి మనలో

చింతలు వీడినచో
రోజూ దీపావళి
దుష్ట సాంగత్యమే
దునుమాడిన సుఖమే

పదిమంది బ్రతుకుల్లో
తేవాలి దీపావళి
అప్పుడే నిజమైన
పండుగ దీపావళి


కామెంట్‌లు