నహుషుడు.;- సేకరణ : డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .99884429899

 చంద్ర వంశంలో ' బుధుడు ' '  ఇల ' దంపతులకు,' పురూరవుడు ' జన్మించాడు అతని భార్య ' ఊర్వశి ' వీరికి ' ఆయువు ' జన్మించాడు,అతని భార్య ' స్వర్బాన '. వీరి పుత్రుడు ' నహుషుడు ' ఇతని భార్య
' ప్రియంవద,'   వీరికి యతి, యయాతి, సంయుక్తి,అయూతి,ఉద్దవుడు అనే ఐదుగురు కుమారులు.
 ' విశ్వరూపుడు '  అనే పండితుడు  రాక్షస లక్షణాలు కలిగి ఉండటంచేత అతన్ని ఇంద్రుడు సంహరించాడు,బ్రహ్మణ హత్యాపాతకం నివారణకై ఇంద్రుడు స్వర్గం వదలి చాలా కాలం పుణ్యతీర్దాల స్నానాలు చేస్తూ భూలోకంలో ఉండిపోయాడు.ఇంద్ర పదవి ఎవరైనా ఉండాలి కనుక అర్హుడైన నహుషుని తీసుకు వెళ్లిన సప్తరుషులు ఇంద్రపదవి అప్పగించారు. ఇంద్ర సింహాసనం అధిష్టించిన నహుషుడు దుర్బుధ్ధితో ఇంద్ర పదవితో పాటు ఇంద్రుని భార్య ' శచిదేవి ' కూడా తనకు చెందాలని అప్పుడే ఇంద్ర పదవికి సంపూర్ణత అన్నాడు.శచీదేవి దేవతల గురువైన 
' బృహస్పతి ' కి విషయం విన్నవించింది. అది విన్న బృహస్పతి సప్తరుషులు నహుషుని పల్లకీలో మోసుకువస్తే, అతని కోరిక తీరుతుందని నహుషునికి తెలియజేసాడు.
మరుదినం నహుషుడు అగస్త్యుడు,గౌతమ,భరధ్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని,కస్యప  మహర్షులను పిలిచి ' ఇంద్ర పదవిలో ఉన్ననేను ఆజ్ఞాపిస్తున్నాను, నన్నుపల్లకీలో మీరు మోసుకుంటూ శచీదేవి మందిరానికి తీసుకువెళ్లండి ' అన్నాడు.ఇంద్ర పదవిని గౌరవించిన సప్త రుషులు నహుషుని పల్లకిలో ఎక్కించుకుని మోసుకుంటూ బయలుదేరారు.  అందరిలో ముందు ఉన్న అగస్త్యమహర్షి పొట్టిగా ఉండటం వలన పల్లకి మోయలేక నెమ్మదిగా నడవసాగారు. అదిగమనించిన నహుషుడు చేతికర్రతో అగస్త్యు ని తడుతూ ' సర్ప సర్ప' అన్నాడు (వేగం అని అర్ధం) అప్పుడు అగస్త్యుడు కోపంతో ' నేటితో నీపుణ్యం అయిపోయింది. సర్పమై భూలోకంలో పడిఉండు ' అని శపించాడు.వెంటనే నహుషుడు సర్పమై భూలోకంలో పడ్డాడు. తన తప్పు తెలుసుకున్న నహుషుడు శాప విమోచనకు వేడుకోగా, సర్పంగా ఉంటూ నీవు వేసే ప్రశ్నలకు ఎవరు సరైన సమాధానం చెపుతారో అప్పుడే నీకు శాప విమోచన ' అన్నాడు అగస్యూడు.
అలా శాపవశాత్తూ నహుషుడు సర్పరూపంలో ద్వైతవనంలో తిరుగుతున్నాడు. ఒక సందర్భంలో భీముడు అటు రావడం తటస్థించింది. కొండచిలువ రూపంలోని నహుషుడు మాంచి కండపట్టి ఉన్న భీముని అమాంతం చుట్టిపారేశాడు. భీముని పరాక్రమం నహుషుని పట్టు ముందర ఎందుకూ కొరగాకుండా పోయింది. మరికాసేపటిలో నహుషుడు, భీముని ఫలహారం చేస్తాడనగా... తన సోదరుని వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడకు చేరుకున్నాడు. నహుషుని చెరలో విలవిల్లాడుతున్న భీముని చూడగానే ధర్మరాజుకి ఆ సర్పం సామాన్యమైనది కాదని అర్థమైంది. దాంతో మెల్లగా దాన్ని మాటల్లోకి దింపి తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. ‘నీ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే నా సోదరుడిని విడిచిపెడతావా!’ అని ప్రతిపాదించాడు ధర్మరాజు.
 ‘నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, శాపవిమోచనాన్ని కలిగిస్తానంటే అంతకంటేనా! జవాబులు చెప్పకుంటే మాత్రం నీ సోదరుని చావు తథత్యం!’ అన్నాడు సహుషుడు. సహుషుడు, ధర్మారాజుని రెండు ముఖ్యమైన ప్రశ్నలు వేశాడు. అవి ‘బ్రాహ్మణుడు అంటే ఎవరు? అతను ఏం తెలుసుకోవాలి?’ అని. దానికి ధర్మరాజు ‘సత్యం, దానం, దయ, వ్యక్తిత్వం, అహింస, నిగ్రహము... వంటి లక్షణాలు ఉన్నవాడే బ్రాహ్మణుడనీ, అతను దుఃఖానికి అతీతమైన పరబ్రహ్మను తెలుసుకోవాలనీ’ బదులిచ్చాడు. అంతేకాదు! ఈ గుణాలు కలిగినవారెవ్వరైనా సరే బ్రాహ్మణులని చెప్పుకొచ్చాడు.
 ధర్మరాజు జవాబులకు నహుషుని మనసుకి సబబుగా తోచడంతో అతనికి శాపవిమోచనం కలిగింది. ఇటు భీమునికీ స్వేచ్ఛ లభించింది. పౌరులను పాలించాల్సిన రాజుకి, ఆ పాలనాధికారమే తలకెక్కిన రోజు నహుషునిలా దిగజారిపోక తప్పదని ఈ కథ చెబుతోంది.

కామెంట్‌లు