ఆరోగ్యమే మహాభాగ్యం;- సి.హెచ్.ప్రతాప్
 మహాభాగ్యం అంటే ఆరోగ్యమే కానీ ధనం, సిరి సంపదలు, క్షణికమైన సుఖం ఇచ్చే భౌతిక సౌఖ్యాలు కానే కాదు. ఆరోగ్యం అన్నదే సంపద! ధనం అన్నది భాగ్యం కాదు కనుక మన మనస్సుల్లో ఆ ‘ధనం’ అన్నదాని మీది ప్రాముఖ్యం తీసివేసి ‘ఆరోగ్యం’ అన్నది పెట్టుకోవాలి. అనుక్షణం ఆరోగ్యంగా వుండడం పైనే దృష్టి సారించాలి.
మనకు నిర్దేశించిన విద్యుక్త ధర్మాలనూ, రోజువారీ విధులనూ నిర్వర్తించడానికి మనకు కావలసింది ఆరోగ్యవంతమైన శరీరం. దేహం రోగాల కుప్పగా మారితే మనం ఏ పనీ చేయలేం, మరేదీ సాధించలేం. ‘శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి అనుభవజ్ఞులైన వైద్యులు రూపొందించిన బలాన్నిచ్చే మంచి ఔషధాలను సేవిస్తుండాలి. ఆరోగ్య సూత్రాలను పాటిస్తుండాలి’ అని భారతీయ సనాతన ధర్మం మనకు ప్రబోధిస్తున్నది. నిన్నటి తరం వారు వీటిని సమృద్ధిగా పాటించడం వలనే ఎలాంటి చీకు చింత లేకుండా,స్వల్ప అనారోగ్య సమస్యలతో నిండు నూరేళ్ళూ సుఖంగా జీవించారు. ఆ తరాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో వుంది. వ్యసనమొక నాగరిక లక్షణమని భావిస్తున్న మనం- ప్రకటనల్లో వెలువడుతున్న హెచ్చరికలైన ‘హానికరం’ అనే మాటను నిర్లక్ష్యం చేస్తూ వ్యసనాలబారిన పడడం కూడా అనారోగ్యానికి మరో మూలహేతువు. ఇది కూడా మనందరం తెలిసి చేస్తున్న తప్పే! తప్పనిసరి తప్పులుగా మిగిలిన ఈ వ్యసనాలకు పర్యవసానమే మన నేటి అనారోగ్యకర జీవనం! ఆరోగ్యం పొందాలంటే వ్యవసనాలకు దూరం కావాలి.
ప్రత్యక్ష దైవం అయిన సూర్యున్ని ఉపాసించడం వల్ల ఆరోగ్యమూ, అగ్నిని ఉపాసిస్తే సంపదలూ సమకూరుతాయి. ఈశ్వరుని అనుగ్రహంతో జ్ఞానం సిద్ధిస్తుంది. జనార్దనుడు (విష్ణువు) దయ తలిస్తే మోక్షం అబ్బుతుందనేది’ ఆర్యోక్తి. వీటన్నిటిలోనూ ప్రధానమైంది ఆరోగ్యమే. మానవాళి వివేకంతో కలుషితమైన పదార్థాలను తినకుండా, వాతావరణ కాలుష్యాన్ని పెంచకుండా అప్రమత్తంగా ఉండాలి.మానవుల ‘జిహ్వ’ చాపల్యం అటువంటి అమూల్యమైన ఐశ్వర్యాన్ని మనకి అందకుండా చేస్తుంది. ఆరోగ్యంగా వుండడానికి ‘ఆహారం’ ఎంత ముఖ్యమో- అదే ‘ఆరోగ్యం’ పాడయిపోవడానికి దోహదపడేది కూడా అసంతులిత ఆహారమే! మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు- తదితర పోషకాల గురించి సరి అయిన అవగాహనతో ఆహార పదార్థాల సేవనం సమతౌల్యంగా అందించ గలిగితే ఆరోగ్య మహాభాగ్యాన్ని అందుకోవడం అసాధ్యమేమీ కాదు. 
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం