బాలల దినోత్సవం!!- ప్రతాప్ కౌటిళ్యా,,
మాట్లాడక ముందు మనుషులు
ఋషులు మునులు యోగులయ్యారు!!!


మాట్లాడిన తర్వాత మనుషులు
ప్రవక్తలయ్యారు!!!?


ఆ తరువాత మనుషులు
వక్తలయ్యారు!!!?


స్వాంతన జ్ఞానాన్ని ఇచ్చిన మనుషులు
మహా పురుషులు అవతారపురుషులయ్యారు.!!


జ్ఞానం విజ్ఞానం
విడిపోయిన తర్వాత
వాళ్లు తత్వవేత్తలు శాస్త్రవేత్తలయ్యారు.!!?

మనుషులు మాట్లాడక ముందు
పుట్టిన పిల్లలు
ఆకలి అమాయకం అజ్ఞానం మాయలో బతికారు.!!!

మనిషి మాట్లాడిన తర్వాత
పుట్టిన పిల్లలు
స్వర్గం నరకం దేవుడు దయ్యం మాయలో బతికారు.!!!

జ్ఞానం విజ్ఞానం విడిపోయిన తర్వాత పుట్టిన పిల్లలు

వర్తమానాన్ని నమ్మి
కాలం విలువ ధనం విలువ తెలుసుకున్నారు.
భూమి బుద్ధితోనే కలిసి బతుకుతున్నారు.!!

వాళ్లు తత్వవేత్తలు శాస్త్రవేత్తలు గానే ఎదుగుతున్నారు.!!!!

బాలల దినోత్సవం పురస్కరించుకుని.

కామెంట్‌లు