సుప్రభాత కవిత ;- బృంద
తరిమిన అలజడులు
తడబడే అడుగులు
ఎదసడే ఉరుములు
ఎగిసిపడే తలపులు

ఉదయరాగాలు పలికే గాలులు
హృదయాన్ని మీటే తరంగాలు
ఉత్తేజం ఇచ్చే వెలుగులు
ఉదయం తెచ్చే ఊరటలు

అణువణువూ పులకరించే
ఆత్మీయంగా పలకరించే
ఆమని  పిలిచే పిలుపులు 
తొలకరి  చినుకుల తడుపులు

మది తడిపే  భూపాలాలు
తుది లేని ఆనందభైరవులు
నది  పలికే  గమకాలు
తుది లేని  తమకాలు

రెక్కలొచ్చి ఎగిరే  మనసులు
చుక్కలందుకోవాలని తపనలు
చక్కనైన రూపుదాల్చు కోరికలు
ముక్కలైపోవు  ఆటంకాలు

నిన్నెంత కఠినమో
నేడంత  సులభం
రేపు నిలుపు ధైర్యం
కాలం నేర్పే పాఠం

వెలుగురేఖల పల్లకీలో
వచ్చు వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు