నానీలు;- సుమ కైకాల
1. మనసు దీపం
    దివ్యంగా వెలుగుతోంది
    నా పక్కన
    నువ్వున్నప్పుడు!...

2. జ్ఞాన దీపాలు
    బారులు తీరాయి
    బడిలో పిల్లలు
    వరుసలో కూర్చుంటే!...

3. ఇంటి ముందు 
     వెలుగు పూలు
     వెదజల్లుతున్నాయి
     దీపావళి చిచ్చుబుడ్డి!...

4. ఇంటింటా దీపాలు
    ఆనందాల మతాబులు
    లక్ష్మీదేవి పూజలు
    దీపావళి!...

5. నరకాసుర వధ
    సత్యభామ విజయం
    అజ్ఞానం తొలగి
    దీప కాంతులు!...
కామెంట్‌లు