శ్రీరాముడు ; కొప్పరపు తాయారు
శబర్యా పూజితః సమ్యక్ రామో దశరథ ఆత్మజః |
సుగ్రీవాయ చ తత్ సర్వం శంసత్ రామో మహాబలః 

ఆదితః తత్ యథా వృత్తం సీతాయాః చ విశేషతః |

సుగ్రీవః చ అపి తత్ సర్వం శ్రుత్వా రామస్య వానరః |
చకార సఖ్యం రామేణ ప్రీతః చ ఏవ అగ్ని సాక్షికం |
తతో వానర రాజేన వైర అనుకథనం ప్రతి
రామాయ ఆవేదితం సర్వం ప్రణయాత్ దుఃఖితేన 
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలి వధం ప్రతి |

మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తనవృత్తాంతమును అంతయును దెలిపెను. మఱియు సీతాపహరణ గాథను గూడ ఆయనకు పూర్తిగా వివరించెను. !
సుగ్రీవుడును శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నింటిని వినెను. శ్రీరామునకు తోడ్పడుటవలన తనకు ప్రయోజనము కలుగునని భావించి, అతడు శ్రీరామునితో అగ్నిసాక్షిగా మైత్రిని నెఱపెను. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై యుండుట గమనించి, శ్రీరాముడు "నీ దుఃఖకారణమేమి?" అని అతనిని అడిగెను. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికిగల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథను (తనదురవస్థను) అంతయును రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా దెలిపెను. !
అనంతరము రాముడు "వాలిని వధింతును" అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలియొక్క (అసాధారణ) బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించెను.

కామెంట్‌లు