క్రియా యోగ సాధనమున నిశ్వాసను నిరోధించి...
ప్రాణ, వ్యాన, ఉదాన, సమాన, అపానములౌ...
పంచప్రాణముల నేకము జెసి,
మూలాధారమున నున్న ప్రాణశక్తిని మేల్కొల్పి...
ష ట్చక్రములనూ శుద్ధి గావించి...
జీవుని , యోగి ని గావించి...,
ఇడా - పింగళుల ప్రోద్బలంతో
త్రికూటమ్మున నిలుపవలె !
అహంకారుడౌ సుషుమ్ను ని, నిర్జించ గలిగి నప్పు డే...,
అంతరాత్మ పరిశుద్ధుడై....
ఆత్మాను సoధానుడౌను రా..!
ఆ జీవ - బ్రహ్మా , ఐక్యమే.....
సమాధి స్థితి యౌనురా !!
ఇదియే... యోగము
ఇదియే... మోక్షము
ఇదియే... పునర్జన్మ రహితము.. !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి