బాలుడను
అవుతా
బాంబులు
ప్రేలుస్తా
పటాసులు
కాలుస్తా
పండుగను
చేసుకుంటా
తోరణము
కడతా
సన్నాయిని
వాయిస్తా
అమ్మలక్ష్మిని
ఆరాధిస్తా
కరుణచూపి
కావుమంటా
పద్మవాసిని
పూజిస్తా
ప్రదక్షణలు
పలుచేస్తా
పొంగలి
పెడతా
ప్రసాదాన్ని
పంచుతా
గళమెత్తి
గంతులేస్తా
శివమెత్తి
చిందులేస్తా
ఆటలు
ఆడుతా
పాటలు
పాడుతా
నవ్వులు
చిందుతా
మోములు
వెలిగిస్తా
దీపాలు
అంటిస్తా
కాంతులు
వెదజల్లిస్తా
బుడకలు
వదులుతా
రంగులు
చల్లుతా
రేయిని
పగలుచేస్తా
తిమిరాన్ని
తరిమేస్తా
అతిధులను
ఆహ్వానిస్తా
ఆనందమును
అందించుతా
కలమును
పడతా
కవితను
కూరుస్తా
శ్రీలక్ష్మిని
రమ్మంటా
సిరులనిచ్చి
పొమ్మంటా
===================================
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి