భూదేవి .... కోరాడ నరసింహారావు !
 భూదేవి సంధ్య వారుస్తోంది !
 వేకువన నే దినకరునికి సుప్రభాత సేవజేసి..., 
.   సాయంసంధ్యవేళ వీడ్కోలు పలుకు తోంది !!
     ఇది అను నిత్యమూ భూదేవి ఆచరించే సూర్య ప్రదక్షిణ సేవ... !
     తను విశ్రమించకున్నా.... 
 విరామము నాశించక పోయినా..., 
    ఆ తల్లి అలసి, సొలసిన తన బిడ్డలను సేద దీర్చ... 
   తను చీకటి లోనికి జారుకుంటోంది..., 
   పగలంతా జీవకోటికి వెలుగులు వెదజల్లిన... 
   సూర్య దేవునికి ప్రణమిల్లుతూ.... !!
       ******

కామెంట్‌లు