మా నాయన యాదిలో- డా.చీదెళ్ళ సీతాలక్ష్మి

 వైద్య రంగంలో సేవచేసి
ఆ రంగానికే వన్నె తెచ్చి
ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టి
వైద్యునిగా నిరంతరం ఆయువును కాపాడి
ఆయుర్దాయం పెంచి
ఏమీ ఆశించక
తనవంతు కృషిచేసిన
ఆయుర్వేద విశారద
ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు
మనిషిని చూస్తేనే రోగాన్ని కనిపెట్టి
రోగిని రక్షించి ఇట్టే
పైసకూడా ఆశించని
గొప్ప వైద్యుడు
ధన్వంతరి వారసుడు ఆయుర్వేదాన్ని అవపోసనం పట్టిన ఘనుడు
మా నాయన అంటూ
గర్వంగా చెప్పుకునే
డా.చీదెళ్ళ రాఘవ శాస్త్రి
నీడలో బ్రతికిన మేము
ఏమిచ్చినా తీరని ఋణం
నమస్కారంతో 
ఆయన సేవను తలుస్తూ
ఆయన ఆశీస్సులు మాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని
ఆయుర్వేద దినోత్సవ శుభాకాంక్షలతో...🎉🙏
మీ కూతురు
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
కామెంట్‌లు