న్యాయాలు -317
సముద్ర వృష్టి న్యాయము
****
సముద్రము అంటే సాగరము, జలనిధి, పయోనిధి, ఉదధి ,జలధి సంద్రము అనే అర్థాలు ఉన్నాయి.వృష్టి అంటే వాన, వర్షము.
సముద్ర వృష్టి అంటే సముద్రములో వాన కురవడమని అర్థము.
సముద్రంలో వాన కురవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అలాగే సహాయం అవసరం లేని వారికి చేయాలనుకోవడం అవివేకము అనే అర్థంతో ఈ "సముద్ర వృష్టి న్యాయము"ను ఉదాహరణగా చెబుతుంటారు.
లోకరీతిని కాచి వడపోసిన మన పెద్దలు ఈ "సముద్ర వృష్టి న్యాయము"ను సృష్టించారు.
అందుకే భాస్కర శతక కర్త ఇలా అంటాడు.
"సిరిగలవానని కెయ్యెడల జేసి నే మేలది నిష్ఫలంబగున్/నెఱిగుఱిరాదు పేదలకు నేర్చున జేసని సత్ఫలంబగున్/పఱపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటం/ గురిసినగాక యంబుధల గుర్వంగ నేమి ఫలంబు భాస్కరా!"
"మేఘుడు వానలు లేక ఎండిపోవుచున్న చేలపై వర్షించిన లాభము కాని సముద్రము పై వర్షించిన ఏమి లాభము? అదేవిధంగా పేదవారికి సాయపడాలి కాని ధనికులకు సాయపడిన ఏమి ప్రయోజనము?
దీనికి సంబంధించిన శ్లోకాన్ని కూడా చూద్దాం.
"వృధా వృష్టిఃసముద్రేషు/ వృధా తృప్తస్య భోజనం/వృధా దానం సమర్థస్య/వృధా దీపం దివాపి చ."
అంటే సముద్రములో వర్షం కురవడం వ్యర్థం . అదే వర్షం పంట పొలాల్లో కురిస్తే ప్రయోజనం ఉంటుంది.కడుపు నిండా తిన్న వ్యక్తికి మళ్ళీ తినమని భోజనం పెట్టడం వృధానే.అలాగే దానం ఎవరికి అవసరమో ఆ వ్యక్తికి చేయాలి అంతే కానీ అవసరం లేని వ్యక్తికి చేసే దానం వృధా.ఇక పగటి పూట దీపం వెలిగించడం కూడా వృధానే కదా! అంటే ఎప్పుడు ఎవరికి ఏ అవసరమో ఆ ప్రకారం, ఆ విధంగా చేయడం వల్ల చేసిన పనికి ప్రయోజనం ఉంటుంది.
ఇక మన చుట్టూ ఉన్న బంధు వర్గాలను, మిత్రబృందాలను గమనించినప్పుడు ఈ న్యాయము కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.ధనవంతులు ధనవంతులవైపే మొగ్గు చూపుతూ వుంటారు. పేద వారితో స్నేహం చేయడానికి, బంధువులుగా చెప్పుకోవడానికి ఇష్టపడరు.
వివాహ బంధాలను కలుపుకొని పోవాలని అనుకున్నప్పుడు కూడా విద్యా ఉద్యోగం, చదువు సంస్కారం ఉన్నప్పటికీ వెనకాల ఆస్తిపాస్తులు సమ ఉజ్జీగా లేవని వద్దనుకోవడం చూస్తూ ఉంటాం.
ఉన్నవారు తమ ఆర్థిక పరమైన సమస్యల్ని ఎలాగైనా తీర్చుకోగలరు. వారికి సాయం చేయాల్సిన అవసరం అంతగా ఉండదు. కానీ పేదవారికి అవసరమైన సాయం చేయాలి.అప్పుడే వారి జీవితంలో వెలుగులు నింపిన వారము,ఓ గాడిన పడేసిన వారము అవుతాము.
కాబట్టి మనం చేసే మాట ,చేత, హార్థిక, ఆర్థిక సహకారం"సముద్ర వృష్టి న్యాయము" వలె కాకుండా చూసుకోవాలి. ఎవరికి ఎప్పుడు ఏమి అవసరమో అది చేస్తేనే ఆత్మ తృప్తి వుంటుంది. మనం చేసిన పనికి ప్రయోజనం ,సాయానికి సార్థకత చేకూరుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి