అమ్మ ప్రేమ!!!; -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని జి పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా
భూమి తిరుగుతుంది కానీ
నిన్ను తిప్పటం లేదు!

భూమి నిన్ను ఆకర్షిస్తుంది కానీ
నిన్ను ఆపటం లేదు!!

గాలి నీలో ఐక్యమవుతుంది కానీ
నీకు కనిపించడం లేదు!!!

నీరు నీలో పారుతుంది కానీ
నిన్ను వీడిపోలేదు!!!

ఆకాశమంత అమ్మ ప్రేమ అది!
భూలోకమంతా అమ్మాయి ప్రేమ దానిది!!!

అద్దంలో అద్దాలమేడ అబద్ధం కాదు
గద్ద భూతద్దంతో భూమిని చూస్తుంది
అది అబద్ధం కాదు!!?

ఇవి రెండు కళ్ళు- చూపు ఒకటే!
ఇవి రెండు పెదవులు -మాట ఒకటే!!
ఇవి రెండు కాళ్లు -నడక ఒకటే!!!!!

చేతలకే
చేతులు రెండు ఒకటై నమస్కరిస్తాయి!!!

శక్తివంతమైన ప్రపంచాన్ని
ఎదుర్కొనడానికి
శక్తివంతమైన ప్రతిభా ప్రజ్ఞా అవసరమే
కానీ అమ్మలాంటి
అమాయకత్వంతో కూడా
దాన్ని అధిగమించవచ్చు!!!

కౌన్ బనేగా కరోడ్పతి లో
కోటి రూపాయలు గెలుచుకోకపోవచ్చు
కానీ కోటి మందికైనా తెలుస్తావు కదా!!?

బ్యూటీ గా ఉంటేనే
సెలబ్రిటీ కావచ్చు కానీ
ఆట పాట మాట నటనతో కూడా
సెలబ్రిటీ వి కావచ్చు బ్యూటీతో పనిలేదు!!?
ఇది అమ్మ మాట అమ్మ ప్రేమ!!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని జి పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం