పిల్లలూ... సరదా.. సరదా గా..
మనమంతా... మతాబులు, చుచ్చు బుడ్లతో... బాణసంచా కాల్చి...,
దిబ్బు - దిబ్బు దీపావళి...
మళ్ళీ వచ్చే నాగుల చవితీ
అన్నాము కదా.... !
ఇదిగో....ఈ రోజే...ఆ నాగులచవితి !!
వేకువ జామునే లేచాము...
తలలకు స్నానము చేసాము,
పూజాద్రవ్యములన్నీ తీసుకు
పుట్ట వద్దకు వచ్చాము... !
ముందుగా... అమ్మ పుట్టను
మంచినీళ్ళతో శుద్ధి చేసి...
చోడిపిండిని చల్లి... పుట్టకు పసుపు, కుంకుమలద్ది...,
దీపము వెలిగించి...,
పత్రీ, పూలతో పూజను చేసి,
అందరమూ....,
పుట్టలో కోడి గ్రుడ్లను,ఆవుపాలను , నువ్వు చిమ్మినీ. ముద్దలను, ముదురు తాటి గుజ్జులను వేసి... భక్తి, శ్రద్దలతో నమస్కరించి, బాణ సంచాను కాల్చుదము !
అసలీ నాగులచవితిని మనము, ఎందుకు చేయు దుమో...
. తెలియునా మీకు పిల్లలూ ?
నరులకూ - నాగులకూ..
వచ్చిన వైరము తొలగించ...
ఇరువురికీ బంధువైన ఆస్తికముని తగవు తీర్చగా...
ఆ మైత్రికి గుర్తుగ.... మనము
మనమీ నాగులచవితిని...
జరుపుకొను చున్నాము... !
తెలిసిందా... మీకు పిల్లలూ
మన పెద్దలు చేసే పండుగలు
మనమూ చెయ్యాలి ఎప్పుడూ !!
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి