షోడశిపూజ! అచ్యుతుని రాజ్యశ్రీ

 శ్రీరామ కృష్ణ పరమహంస భార్య శారదామాతను షోడశిపూజ తో అర్చించారు.25మేనెల1873 లో అమావాస్య రోజున కాళికాదేవి అర్చన చేశారు ఆయన.తన కర్మఫలాన్ని దేవికి అర్పించారు.ఆదంపతుల భౌతిక జీవితం లో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక సాధన అది.దక్షిణభారతంలో షోడశిని రాజరాజేశ్వరీ త్రిపుర సుందరి గా అర్చిస్తారు.షోడశిని పరమహంస మాతశారదలో ఆవాహన చేసి పూజించారు ఆరోజు.ధూపం అగరువత్తిదీపం తో అంతా శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఆపై శారదాదేవి ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు.ఇద్దరూ ధ్యానం లో ఉండిపోయారు.శివుడు శక్తి ఒక్కరే! రామకృష్ణులు ఈపూజద్వారా తెలియజెప్పిన విషయం ఏమిటంటే అగ్ని దాహకశక్తి లాగానే ఒకేశక్తి రెండు శరీరాలుగా అవతరించింది.శారదామాత షోడశీదేవి ఐతే పరమహంస శివుడే! ఇది శారదామాత పరమహంసల జీవితం.పేరుకి భార్యాభర్తలు కానీ ఆధ్యాత్మిక చింతన లో అందరికీ ఆదర్శంగా నిలిచారు 🌷
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం