శ్రుతి మించిన పిచ్చి సరికొండ శ్రీనివాసరాజు
   వాసు చాలా దిగులుగా ఉన్నాడు. పాఠశాలకు వచ్చినప్పటి నుంచీ ఎవరితోనూ మాట్లాడటం లేదు. రోజూ అందరినీ పలకరిస్తూ బాగా ముచ్చట్లు చెప్పేవాడు ఈరోజు ఎవరు పలకరించినా మాట్లాడటం లేదు. ఆ ఒక్కరోజుతో అయిపోలేదు. వారం దాటినా అదే పరిస్థితి. వాసు ప్రాణమిత్రుడు రాము వాసూను పక్కకు తీసుకెళ్ళి నిలదీశాడు. ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్లో మన భారత ఆటగాళ్లు అన్ని మ్యాచుల్లో గెలిచి చివరకు ఫైనల్లో ఓడిపోయారు. నేనొక్కడినే కాదు. భారత క్రీడాభిమానులు అంకా నిరాశతో ఇలానే ఉన్నారు. తెలుసా?" అన్నాడు వాసు.
         " చూడు వాసూ! నువ్వు చిన్నప్పటి నుంచి చదువులో మీ తరగతిలో నువ్వే ఫస్ట్ ర్యాంకు. 9వ తరగతిలోకి వచ్చినప్పటి నుంచీ సెల్ ఫోన్లు, టీ.వీ.ల పిచ్చిలో పడి చదువులో చాలా వెనుకబడ్డావు. మరి అన్ని సంవత్సరాలు బాగా కష్టపడి చదివిన వాడివి హఠాత్తుగా చదువులో చిత్తుగా ఓడిపోతున్నావు. తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెడుతున్నావు. వచ్చే సంవత్సరం 10వ తరగతికి వస్సున్నావు. కీలకమైన దశలో నువ్వు ఇలా చేస్తే మీ అమ్మ తన బాధను ఎవరికీ చెప్పుకోలేక మా అమ్మతో చెప్పుకొని వెక్కీ వెక్కీ ఏడ్చింది తెలుసా? మరి మీ అమ్మ దిగులుతో సరిగా తింటుందో లేదో! ఆలోచించావా?" అన్నాడు రాము.
      వాసు సిగ్గుతో తల వంచుకున్నాడు. తల్లికి క్షమాపణ చెప్పుకొని, అనవసర వినోదాలను పక్కన పెట్టి, తిరిగి చదువులో పడ్డాడు.

కామెంట్‌లు