శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
శ్రమణాం ధర్మ నిపుణాం అభిగచ్ఛ ఇతి రాఘవ |
సః అభ్య గచ్ఛన్ మహాతేజాః శబరీం శత్రు సూదనః |
శబర్యా పూజితః సమ్యక్ రామో దశరథ ఆత్మజః |
పంపా తీరే హనుమతా సంగతో వానరేణ హ !

శత్రువులను రూపుమాపువాడును, మహాతేజశ్శాలియు ఐన శ్రీరాముడు శబరికడకు వెళ్ళెను. శబరి భక్తిశ్రద్ధలతో కొసరి కొసరి ఫలములను అర్పించి, ఆయనను పూజించెను..
పంపాసరస్సుతీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలిసికొనెను. ఆ వానరోత్తమునిసూచనను అనుసరించి, రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను.

కామెంట్‌లు