ప్రేమధార;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్

 నీ ప్రేమధార
నీ కంటిచూపులోంచి 
నా హృదయంలోకి
ప్రవహిస్తోంది
అందుకే
నీవే నా చూపువయ్యావు
నీ ప్రేమధార
నీ నోటిమాటల్లోంచి
నా మనసులోకి ప్రవహిస్తోంది
అందుకే 
నీవే నా శబ్దానివయ్యావు
నీ ప్రేమధార
నీ స్పర్శలోంచి 
నా అంతరంగంలోకి ప్రవహిస్తోంది
అందుకే
నీవే నా మధురానుభూతివయ్యావు
నీ ప్రేమధార
నీ నిశ్వాసలోంచి
నా శరీరంలోకి ప్రవహిస్తోంది
అందుకే నీవే నా ఊపిరివయ్యావు 
అందుకే ప్రియా!
నువ్వే నేను!!
*********************************

కామెంట్‌లు