హైదరాబాదులోని త్యాగరాయగాన సభలో 11/ 11/ 2023న మహర్షి వాల్మీకి సాంస్కృతిక కళా సేవాసంస్థ వారు మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో నంద్యాల జిల్లా జలవనరుల శాఖలోని తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూ, సాహిత్య రంగంలో సైతం కవయిత్రిగా అద్భుత ప్రతిభ కనబరుస్తూ, అనన్య రచనలతో మేటిగా వెలుగొందుతున్న శ్రీమతి ఎస్. రత్నలక్ష్మిని పలువురు ప్రముఖుల నడుమ త్యాగరాయగాన సభలో అభినందిస్తూ సుందర పుష్పగుచ్చాన్ని అందించి, విశిష్టమైన మెరిసే మెమెంటోతో బాటుగా పుస్తక ప్రసాదాన్ని బహుకరించి, అందమైన దుశ్శాలువాతో వీ.డి రాజగోపాల్ గారు మరియు ఇతర ప్రముఖులు సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు విశిష్ట అతిథులు,కవులు, కవయిత్రులు, రత్నలక్ష్మి గారి కవితా పఠనం చాలా బాగుందంటూ ప్రశంశిస్తూ అభినందించారు.
ఇంజనీరైన మహిళా కవయిత్రి రత్నలక్ష్మికి అపూర్వ సన్మానం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి