సుప్రభాత కవిత ; -బృంద
వెల్లువైన వెలుగుల్లో
తుళ్ళిపడే కిరణాలు
వెల్లివిరిసే ఆడవిలో
తెల్లవారిన తరుణాలు

ఆకుపచ్చని  వనమంతా
ఆవరించెను వెలుతురు
అమాయకంగా కళ్ళుతెరచిన
అందమైన అరణ్యం

జాలువారే జలతారు
జిలిబిలి వన్నెలు
జావళీ ఆలపిస్తూ
జగతిని పలకరింప

గలగలమని కదిలే ఆకుల 
మురిపించే మువ్వల సవ్వడి
జలజలమని జారిపోవు
జలపాతపు సిరినవ్వుల సడి

పాలమబ్బుల పలకరింపుతో
పసిడిపూతల పులకరించే
పచ్చికతో అందాలొలుకుతూ
పరవశించే పర్వతాలు

తెరలు తీసిన  శిఖరాలు
పొరలు కప్పిన  మంచులు
దొరలు వెలుగు పువ్వులు
అరకులోయ  సొగసులు

అందమైన జగతికి
ఆనందాలు తెచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు