మర్కటం! అచ్యుతుని రాజ్యశ్రీ

 "తాతా! మాటీచర్ సామెతల కథ చెప్పమంది." శివా అడిగాడు." మర్కటం అంటే ఏంటిరా?" " ఓస్ ఇంతేనా.కోతి తాతా". దాంతో సామెత చెప్పు.""తాతా! కోతి మీద కథలు వచ్చు కాని సామెత తెలీదు.""ఇల్లు ఇరకటం ఆలి మర్కటం అని విన్నావా"? ఆలి అంటే భార్యకదా? కోతి అంటే ఊరుకుంటుందా?" తాత పకపకా నవ్వుతూ అన్నాడు " మన తెలుగు కి తెగులు పుట్టిస్తున్నారు.అసలు పదం ఇల్లు ఇరు కవాటం ఆలి మరకతం అని.మనం గాలివెల్తురు కోసం గదులు కడ్తాం. ద్వారాలు ఎదురు బదురుగా కిటికీలు కూడా ఉంటే ఇంట్లోకి వచ్చి పోయేవారు కన్పడ్తారు.భార్య శుచి శుభ్రత లతో కడిగిన ముత్యం లా ఇల్లాలు మెరిసే మరకతం లాగా ఉండాలి.అలా లేకుంటే ఇల్లు నరకం! ఇల్లు చిన్న చిన్న గదులు కిటికీలు లేకుండా ఉంటే ఆక్సిజన్ రాదు.కార్బన్ డైయాక్సైడ్ తో విషపూరితంగా మారి ఊపిరాడదు.అలాగే సణుగుడు గొణుగుడు సతాయించే భార్య తో మగాడికి మనశ్శాంతి కరువు.అందుకే సంకుచిత భావాలతో మనం ఉంటే అది ఇరుకు ఇల్లు.అంతా చిటపటలాడుతూ ఉంటే మనశ్శాంతి కరువు.కాలక్రమంగా ఇల్లు ఇరు కవాటం కాస్త ఇల్లు ఇరకటంగా మారింది.ఆలిమరకతంలాగా అన్న పదం పోయి ఆలిమర్కటం అంటే కోతిలా మారింది.ఇక పిల్లలు క్రమశిక్షణతో లేకుంటే కిష్కింధ కాండ" అని తాత మాటలకు బామ్మ కూడా నవ్వేసింది 🌷
కామెంట్‌లు