కాన్వెంట్ స్టూడెంట్ ; - కోరాడ నరసింహా రావు
అమ్మ  - నాన్న 
   అంటే... నచ్చదు 
.    తల్లీ - దండ్రులకు... !

మమ్మీ - డాడీ... 
  అంకుల్  - ఆంటీ... 
..  అంటే  మురిసి పోతారు !

అ, ఆ, లంటే... 
   తెలియవు వీడికి 
  A. B. C. D. అంటాడు !

మా  వాడికి 
   తెలుగు  రాదని 
    గొప్పగ చెప్పు కుంటారు !

అర్ధం కాని చదువులతో 
   పిల్లల నిబ్బందుల 
.    పాల్జేస్తారు.... !

ఇంటిదగ్గర 
  హోమ్  వర్కులు 
     చేయించ లేరు... !

క్లాసులలో... 
   టీచరులతో... 
   చివాట్లు తినిపిస్తారు !

గొప్పకు పోయి 
   సాగలేక..... 
   ఇక్కట్లేన్నొ పడేరు !

శక్తికి మించిన 
   చదువులనీ... 
   సగంలోనె వదిలేరు !

ఆంగ్లము - తెలుగు... 
   రెండు భాషలలో... 
      యే భాషయు రాక.., 

ఉట్టికి - చట్టికి... 
    రెంటికీ చెడి... 
  పిల్లలు  రేవడులౌతారు !!

 వ్యయ, ప్రయాసలు లేని 
   ప్రభ్త్వబడులలో పిల్లలను 
      హాయిగ చదివించండి !

మన మాతృభాష తెలుగును 
   ప్రేమతొ అభిమానించి 
       గౌరవాన్ని ఇవ్వండి !!
      ********

కామెంట్‌లు