సంఖ్య -915
🌟🌟🌟🌟🌟🌟🌟
నరకాసుర సంహారకథలు
దీపావళి పండగ కారణాలు
పంటచేలకు తొలగు చీడలు
మందుగుండుతో దివ్యవెలుగులు
టపాసుల మోదం పిల్లలు
ఉమా!
మట్టిప్రమిదలో వెల్గిన వత్తులు
చిట్టిమనసుల్లో గట్టి ఉత్సవాలు
లక్షలమందికి ఉపాధివీలు
ఖండాలు దాటేసే మతాబులు
దీపావళి ఉత్సాహం నింగికే ఉమా!
తిమిరాలు త్రోలే జ్ఞానజ్యోతులు
మహిమలు పంచే మహాశక్తులు
నీలో వెలుగులు నింపే కాంతులు
చాలామందికి ఉపాధియుక్తులు
దీపావళి పండగ సమయం ఉమా!
మట్టిప్రమిదలు తప్పకకొనాలి
నీటిలో తడిపి ఆరబెట్టాలి
వత్తులువేసి నూనెపోయాలి
అసురసంధ్యలో వెలిగించాలి
ప్రహరీ వాకిలి దీపాలతోఉమా!
సురసురాలు లక్ష్మీ బాంబులు
విష్ణు, భూ చక్రముల బిళ్ళలు
పెన్సిల్, చేంతాడు,వెన్నముద్దలు
కాకరపూలును పాము బిళ్ళలు
కొన్ని మైనపు వత్తులుండాలి ఉమా!
రైతులకు పంటతోటి దీపావళి
కార్మికులకి శక్తియే రత్నావళి
మహిళలకి సంతోషం శోభావళి
దేశంలో శాంతితో భద్రావళి
అలరారు చుండ వింధ్యావళి ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి