సుప్రభాత కవిత ; - బృంద
అడుగుకు అడుగే తోడు
ఆలోచనకు ఆచరణే జోడు
తనువుకు మనసే రాజు
కనులకు కలలే మోజు

చూపులు ఆకాశం దాటితే
కనీసం మబ్బులందేను చేతికి
దూరం సాగని యోచనకు
దొరకదు గమ్యం యాచనకు

ఇచ్చుట తెలియని మనసుకు
వచ్చు మార్గం  ఏర్పడదు
ఖాళీ అయిన చోటే చేరును
కలిమైనా......చెలిమైనా

అందించని చేతికి
ఆదరం దొరకదు
స్పందించని  ప్రశ్నలకు
జవాబులే దొరకవు

గుప్పెటతో సాయం చేస్తే
దోసిళ్లు నింపును దైవం
అందినంతా కావాలనుకుంటే
అనుభవించే సమయం ఉండదు

కాలాన్ని మించిన గురువు
ఆరోగ్యాన్ని మించిన భాగ్యం
తృప్తిని మించిన సంపద
ఎంత వెదికినా దొరకవు

మధుర క్షణాల మూటలు
మోసుకు వచ్చే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు