తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
ఒక గొప్ప వ్యక్తి గొప్పగా జీవిస్తాడు
కాబట్టి
ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటాడు!!

మామూలుగా బ్రతికే వ్యక్తి
అంతా మామూలే కాబట్టి
సహజంగా చావాలనుకుంటాడు!!

కానీ
మనిషి తన గురించి తన పుట్టుక గురించి
భూమి గురించి భూమి పుట్టుక గురించి
విశ్వం గురించి విశ్వం పుట్టుక గురించి
విజ్ఞానం గురించి తెలుసుకుంటే

ఏం తెలుసుకుంటాడు!!!!?

ధనం గురించా అధికారం గురించా!?
స్త్రీ పురుషుల గురించా కీర్తి గురించా!?
కాదు

వీటి కన్నా వీటి వెనక ఉన్న
సంతోషం గురించి
మనశ్శాంతి గురించి తెలుసుకుంటాడు!!

భూమిపైనే ఉన్న ఏకైక భూమిక
సమయం గురించి తెలుసుకుంటాడు.!!
అప్పుడు

మనిషి గొప్ప ప్రేమతో
సహజంగా సజీవంగా జీవిస్తాడు!!!


కామెంట్‌లు