మాటలను
తికమకచేస్తా
తికమకను
మాటలుచేస్తా
పువ్వులకు
నవ్వులిస్తా
నవ్వులకు
పువ్వులిస్తా
అందాలను
ఆనందముచేస్తా
ఆనందాలను
ఆందముచేస్తా
మోములకు
వెలుగులిస్తా
వెలుగులకు
మోములనిస్తా
కవితలకు
కమ్మదనమిస్తా
కమ్మదనానికి
కవితలనిస్తా
అక్షరాలకు
పదాలనిస్తా
పదాలకు
అక్షరాలనిస్తా
కలానికి
కాగితమిస్తా
కాగితానికి
కలమునిస్తా
పలుకులకు
పెదవులిస్తా
పెదవులకు
పలుకులిస్తా
తెలుగుకు
తీయదనమిస్తా
తీయదనానికి
తెలుగునిస్తా
నిత్యము
కైతలువ్రాస్తా
కైతలను
నిత్యముచేస్తా
కవితని
కవ్విస్తా
కవ్వింపులను
కవితకిస్తా
కథను
కంచికిపంపుతా
కంచిని
కథకెక్కిస్తా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి