కోరిన వరాలిచ్చే నాగదేవత ;- డా. అరుణకోదాటి
  దీపావళిఅమావాస్య తర్వాత నాల్గవ రోజు వచ్చే  చవితి నాగుల చవితి
 సంతానము లేనివారికి , సంతానమును  చల్లగా, ఏ  బాధలు, జబ్బులు లేకుండా  చూడమని  కోరగానే  వరాలిచ్చే నాగమ్మ తల్లి
 చాలామందికి  ఇంటి ఇలవేల్పుగా  నిలిచి
పూజలందుకుంటుంది.
దంపతుల  గొడవలు  తీర్చి  ఆజంటనుఒక్కటిగా  చేసి
పిల్లా పాపలతో  సుఖసంతోషాలతో వర్ధిల్లమ్మని దీవిస్తుంది.
పుట్టు వెంట్రుకలు, చెవులుకుట్టుట
లాంటివి చిన్నపిల్లలకు పుట్టదగ్గర  చేసి పుట్టమన్ను చెవులకు రాస్తే  మంచిదని 
భావించి తమ  మొక్కులను ఆవిధంగా  తీర్చుకుంటారు.
సంతానము లేనివారు  పుట్ట పైన చెట్టుకి  ఊయల కట్టితే ఎన్నో ఏళ్లుగా  సంతానం  లేనివారుకూడా  సంతాన ప్రాప్తి కలిగారని
నానుడి.
నాగదేవతకు ఇష్టమైన చలిమిడి,
నానుబియ్యం, గుడ్లు, ఇలాంటివి నైవేద్యం  పెట్టి, ఆవుపాలు  పుట్టలో పోసి  ఉపవాసం వాస దీక్ష చేస్తారు.
 అదే నియమంతో   మొక్కుగా  పిల్లలకు  నాగదేవత పేరు వచ్చేట్టు  పేర్లు పెట్టుకుని  ఆదేవతను  పూజిస్తారు.
కామెంట్‌లు