సుప్రభాత కవిత ; -బృంద
చెదిరిన కలలను
చక్కగా పేర్చుకుని
చకచకా సాగాలని
చెవిలో చెప్పే వేకువ

కదిలే అలలపై సాగేనావలా
కష్ట సుఖాల ఒడిదుడుకులన్నీ
కలనేతలా కలిపేసుకుని
కలకలమంటూ సాగమనే వేకువ

కాలం చేసే మాయాజాలానికి
వేలంవెర్రిగా లొంగిపోయినా
కలతలకు కుంగిపోక
కల నిజం చేసుకొమ్మనే వేకువ

ఊగే పడవల సయ్యాటల్లా
ఉప్పెనలాటి భావాలకు
ఉరకలు వేసే ఊహలకు
ఊతమిచ్చే వేకువ

ఉదయంతో మొదలయే
బ్రతుకు చిత్రం
నీటి మీద రాత రాస్తూ
సాగిపోయే వేకువకు

🌸🌸 సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు