సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు -307
సకృత్కృతే కృతః శాస్త్రార్థః న్యాయము
******
సకృత అంటే ఒక్కసారి.కృతే అంటే కొఱకు.కృతః అంటే చాలును,వలదు.శాస్త్రార్థము అంటే శాస్త్రము ద్వారా ఇవ్వబడిన అర్థము.
ఒకసారి  కొరకు ఇవ్వబడిన శాస్త్రార్థము కానీ తెలుసుకోబడినది కానీ మరోసారి ఇవ్వడం, తెలుసుకోవడం కూడా ఎంతో అవసరము అనే అర్థంతో ఈ న్యాయము చెప్పబడింది.
ఈ న్యాయము గురించి తెలుసుకునే ముందు అసలు శాస్త్రము అంటే ఏమిటో? శాస్త్రార్థము అంటే ఏమిటో? ఎందుకు  వాటి గురించి మరోసారి తెలుసుకోవాలో కొంచెం వివరంగా తెలుసుకుందాం.
శాస్త్రము అనేది సంస్కృత పదము. దీనికి సూత్రము,నియమ నిబంధనల పత్రము, సంకలనము, పుస్తకము లేదా గ్రంథము అనే విభిన్నమైన అర్థాలు ఉన్నాయి. వీటి వాస్తవ అర్థాన్ని సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి.
దీనిని మన భారతీయ సాహిత్యంలో సాంకేతిక లేదా ప్రత్యేక జ్ఞానం కోసం ప్రత్యయం వలె ఉపయోగిస్తారు.
ఆంగ్లంలో ఉన్న రకరకాల మాటలకు సమానార్థకంగా శాస్త్రం అనే మాటను ఉపయోగిస్తారు. గణితమును గణిత శాస్త్రం అని  ఫిజిక్స్ ను భౌతికం అనకుండా భౌతికశాస్త్రం అని అంటారు.ఇలా ఆంగ్లంలో 'ics ' తో అంతమయ్యే  వాటిని శాస్త్రం అంటున్నారు.
అయితే ఇదే శాస్త్రాన్ని  సైన్స్ అనే అర్థంతో అంటే ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయాన్ని ఒక పద్ధతి ప్రకారం వివరించేది కాబట్టి దీనిని కూడా శాస్త్రం అని అంటున్నారు.
ఇక శాస్త్రాన్ని బోధనలు అనే అర్థంతోనూ రాయబడినది ( వేదాలు పురాణాలు మొదలైనవి) అనే అర్థంతో కూడా చెబుతారు.
శాస్త్రము అంటే ఏమిటో ఎన్ని అర్థాలు ఉన్నయో తెలిసాయి మనకు. అంటే శాస్త్రార్థం ఏదో ఒక నిర్దిష్టమైన అర్థానికి లోబడి లేదన్న మాట.
శాస్త్రం అంటే ఒక పవిత్రమైన సూత్రమనీ, నియమ నిబంధనలతో కూడినదనీ , పవిత్రమైన గ్రంథమనే అర్థంతో పాటు నిర్థిష్టమైన విషయంపై శాస్త్రీయతతో కూడిన ప్రాథమిక జ్ఞానమని చెప్పబడింది.ఇంకా జానపదుల దృష్టిలో శాస్త్రం అంటే కథ, సామెత అనే అర్థాలు కూడా ఉన్నాయి.
కాబట్టి శాస్త్రార్థమును ఒక చట్రంలో బిగించకుండా విభిన్నమైన కోణాల్లో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ న్యాయంలోని నిగూఢమైన అర్థం.
మనం నిత్యం వింటూ ఉన్న శాస్త్రానికి  ఇన్ని అర్థాలు, అంతరార్థాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.నాటికీ నేటికీ శాస్త్రార్థం మారింది అనేది తెలుసుకున్నాం.ఇంకా  ఏమేం మార్పులు వస్తాయో  వేచి చూడాల్సిందే.ఏది ఏమైనా శాస్త్రార్థమును  కొంత వరకైనా ఈ "సకృత్కృతే కృతః శాస్త్రార్థః న్యాయము" ద్వారా తెలుసుకోగలిగామనే ఆనందం కలుగుతోంది కదండీ!. 
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం