నిద్ర! అచ్యుతుని రాజ్యశ్రీ

 రాత్రి పూట హాయిగా ప్రశాంతంగా చీకటి గదిలో నిద్రపోతే కమ్మగా ఆరోగ్యం బాగుంటుంది.కంటిమీద బట్ట కప్పుకుని పూర్వం పడుకునే వారు.పగటి వెలుగు కంటికి ఒంటికి ఆరోగ్యం.కానీ నేడు రాత్రంతా దీపంకాంతిలో పనిచేసేవారు డిప్రెషన్ కి గురి ఔతారు. టీచర్ ఆమాట చెప్పగానే " మాఅమ్మ నాన్న లు రాత్రి 10 దాకా చదువుకోవాలి అంటారు టీచర్! అప్పుడే అన్నం తింటాం అందరం". టీచర్ అంది " అసలు మనం నిద్రపోయే టైం కి మనం తిన్నది అరగాలి.కనీసం 5గంటల వ్యవధి ఉండాలి.జైనులు సంధ్యాసమయంలోపలే పూర్వం ఆహారం తీసుకునేవారు.నేడు సాఫ్ట్వేర్ జాబ్స్ తో భారతీయుల జీవితం అస్తవ్యస్తం.స్మార్ట్ ఫోన్ కంప్యూటర్ తోపాటు పగలూకూడా ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉండే రోజులు.అందుకే మనసు కుంగిపోయి నీరసంగా తయారు ఔతుంది.అందుకే త్వరగా 9లోపలే నిద్రపోయి 4కిలేచి చదవాలి.త్వరగా ఇవాల్టి నుంచి నేను చెప్పిన ప్రకారం చేయండి.పాటించండి" అలాగే అన్నారు పిల్లలు 🌹
కామెంట్‌లు