హైకూలు;- సుమ కైకాల
చలికాలం
-------------
1. మంచు పొరలు
    అలుముకుంటున్నాయి
    శీతాకాలము!...

2. కార్తీకమాసం
    వణికే చలికాలం
    నమశ్శివాయ!...

3. ఉషోదయాన
    తుషార బిందువులు
    కరిగే మంచు!...

4. చెలి ఊహలు
    మదిలో మెదిలితే
    చలి దూరము!...

5. అల్లరి చలి
    మదిలో కొంటెదనం
    తీయని ఊహ!...

కామెంట్‌లు