కార్తీకం (బాల పంచపది)- ఎం. వి. ఉమాదేవి
సంఖ్య *924
-----------------
ఆశ్వయుజ అమావాస్య వెళ్ళగానే
కార్తీకమాసం ప్రారంభం అగునే 
శివకేశవులకు ప్రీతియగునే
దేవాలయాలు కిటకిటలాడునే
పవిత్రమాసం కార్తీకమూ ఉమా!

ప్రతిరోజుకూ ప్రాముఖ్యతఉన్నది 
సోమవారమూ పావనమైనది
ఏకాదశులు ద్వాదశి కలిగింది 
శివాభిషేకము జరుగుతుంది 
కార్తికపౌర్ణమి అద్భుతమే ఉమా!

నెలరోజుల పూజలు ఘనము
పౌర్ణమి వేడుక సుందరము
త్రిపుర పూర్ణిమ అనెడినామము 
త్రిపురాసురుల సంహారము
ఇతిహాసముగా ఉంది ఉమా!!

కేదారేశ్వరా వ్రతము చేయుదురు
రోజంతా ఉపవాసం ఉందురు
జ్వాలా తోరణం వెలిగించేరు
అఖండ దీపంలో నూనెపో సేరు
కుక్కకు గారెల దండ ఉమా!

కామెంట్‌లు