శ్రీ రాముడు ; కొప్పరపు తాయారు
 రామాయ ఆవేదితం సర్వం ప్రణయాత్ దుఃఖితేన చ 
ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలి వధం ప్రతి |
వాలినః చ బలం తత్ర కథయామాస వానరః |
సుగ్రీవః శంకితః చ ఆసీత్ నిత్యం వీర్యేణ రాఘవే |
రాఘవః ప్రత్యయార్థం తు దుందుభేః కాయం ఉత్తమం |
దర్శయామాస సుగ్రీవః మహాపర్వత సంనిభం |
ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చ అస్తి
 మహాబలః |
పాద అంగుష్టేన చిక్షేప సంపూర్ణం దశ యోజనం |
అనంతరము రాముడు "వాలిని వధింతును" అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలియొక్క (అసాధారణ) బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించెను. !
వాలిని హతమార్చుటకు శ్రీరామునకుగల పరాక్రమ విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహము మెదలుచుండెను. ఆయన బలపరాక్రములను తెలిసికొనుటకొఱకు వాలిచే హతుడైన "దుందుభి"యను రాక్షసుని కళేబరమును సుగ్రీవుడు ఆయనకు చూపెను. మహాపర్వతసదృశమైన ఆఅస్థిపంజరమును జూచి, మహాబాహువైన రాముడు ఒక చిఱునవ్వు నవ్వి, "ఇంతేనా " అనియనుచు దానిని తన కాలిబొటనవ్రేలికొనతో అవలీలగా చిమ్మెను. అప్పుడా కళేబరము పూర్తిగా పదియొజనముల దురమున పడిపోయెను. !
                  ఓం శ్రీ రామం
                  ** ***
కామెంట్‌లు