.మందు మహత్యం !;- ...కోరాడ నరసింహా రావు !
మగవారిగ పుట్టినంత మాత్రానే... 
   పురుషులు కాలేరీ యిలలో !

నొప్పింపక తానొవ్వక... 
   ధర్మ నిరతి చతురతతో... 
      నెరపునట్టి నరులు...., 
   వారు.. స్త్రీలైనా పురుషులే !!

నిజ పౌరుష ధీరతతో... 
  బ్రతుక గలిగి నప్పుడే..., 
      నరులు, పురుషులౌదు రీ భువిలో !

అట్టి పురుష ప్రపంచమే.... 
   ఎట్టి బాధలను లేని... 
     సత్సమాజ మౌనుగదా.. !

నరులై పుట్టి... పురుషులై... 
 ప్రవర్తిల్లు, మహనీయులందరికీ
    శుభాకాంక్ష లందజేతు.... 
      వినమ్ర  ప్రణామములతో !


కామెంట్‌లు