* కోరాడ నానీలు *

 ఆనంద  పారవశ్యంలో 
   కళా కారుడు... !
   మారుమ్రోగే .... 
   కరతాళధ్వనులు.. !!
      *****
ఒకప్పుడు ... 
  రంగస్థలాన్నేలాడు 
  ఈ రోజు ఫుట్పాత్ పై ... !
    దిక్కులేని అనాధ ... !!
     ******
అలనాడు దీనంగా 
   నటి సావిత్రి.. !
  ఈ నాడు...హీనంగా  
   పావలా శ్యామల... !!
   *******
గొప్ప  కళా కారుడే... 
 దిక్కులేని... అనాదై, 
  ఆశ్రమం లో..... 
   నిబద్దత లేకనే .... !
   *******
కళాకారునికి... 
  అధోగతా... పాపం !
  ఆరాధించాలిగా... 
   అహంకరించాడు.. !!
     *******
కామెంట్‌లు