గణిత ప్రతిభా పోటీల విజేతలు వీరే
 సిక్కోలు గణిత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కొత్తూరు మండల స్థాయి గణిత ప్రతిభా పరీక్షలు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగాయి.
ఈ టాలెంట్ పరీక్షకు కొత్తూరు, మెట్టూరు, కుంటిబద్ర, నివగాం, మాతల, కడుము తదితర ఉన్నత పాఠశాలలకు చెందిన 129మంది విద్యార్థులు పాల్గొన్నారు. 
సిలబస్ లో 35ప్రశ్నలు, సాధారణమైన 15ప్రశ్నలతో ఈ ప్రశ్నాపత్రాలు 50ప్రశ్నలతో రూపొందగా, పరీక్షల అనంతరం సంఘ ప్రతినిధులు ఫలితాలను ప్రకటించారు.
10వ తరగతి విద్యార్థుల విభాగంలో ప్రధమ, ద్వితీయ, స్థానాలలో మెట్టూరు, కొత్తూరు విద్యార్థులు బర్రి జశ్వంత్, 
ఎం.షర్మిలలు నిలిచారు. 
తృతీయ స్థానాలకు కడుము పాఠశాలకు చెందిన విద్యార్థులు వి.రిషి తరుణ్, ఎస్.చైతన్యలు ఎంపికైరి. 
కన్సోలేషన్ స్థానాల్లో మెట్టూరు, కొత్తూరు, మాతల, నివగాం విద్యార్థులైన సాయికిరణ్, షర్మిళ, దుర్గారావు, మానస, రంజిత, జశ్మితలు నిలిచారు. 
9వ తరగతి విద్యార్థుల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో మెట్టూరు, కడుము, కొత్తూరు విద్యార్థులైన సుంకరి లోకేష్, వలురోతు లక్ష్మి, ఈపు సాయి ప్రశాంత్ లు నిలిచారు. కన్సోలేషన్ స్థానాల్లో మాతల, కొత్తూరు, మెట్టూరు, కుంటిభద్రలకు చెందిన యామిని, లక్ష్మీ భవాని, సాయిసాత్విక్, అఖిల్ సోమనాథ్, చాందిని, ఉదయకుమార్, వినయ్ లు నిలిచారు.
ఈ కార్యక్రమంలో సిక్కోలు గణిత ఉపాధ్యాయ సంఘం 
మండల ప్రతినిధి దండు ప్రకాశరావు, చోడవరపు కాంతారావు, బాలరాజు మహంతి, కె.వెంకటరావు, జె.తిరుపతిరావు, యల్.గోవర్ధనరావు, మాధవరావు, సంపత్, స్వాతి, పడాల సునీల్, గేదెల వెంకట భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. 
ఈ విజేతలంతా త్వరలో నియోజకవర్గ స్థాయి పోటీల్లోను, 
తదుపరి జిల్లా స్థాయి పోటీల్లోనూ పాల్గొనవలసియుందని నిర్వాహకులు తెలిపారు. అంతిమవిజేతలకు
ఈ ఏడాది డిసెంబర్ 22న గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న జాతీయ గణిత దినోత్సవ వేదికపై బహుమతులను అందజేస్తామని వారు తెలిపారు.
కామెంట్‌లు