నాప్రాణము;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నీ కాలి చిరువ్రేల
ముల్లుగుచ్చినగాని
అది 
నా హృదయాన నాటుకొనును
నీవొక్క ముద్దైన
తగ్గించినా గాని
ఆ దినము 
నాకు ఉపవాసదీక్ష
నీ కంట నీలాల ముత్యమ్ము జారినా
శోక సంద్రమ్ములో
నే మునిగిపోదు
నీవు నీవే
అనుకొందువేమొ గాని
చెలీ!
నీవు
నీవుగావు 
నిజము
నా ప్రాణమ్ము సుమ్ము!
*********************************

కామెంట్‌లు