అంకితం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 చీకటి వెలుగుల సమరం
ఈ జీవితం
నీవు వెలుతురువా?
నే చీకటితో సమరం చేస్తా
వెలుతురు వచ్చేవరకూ!
నీవు చీకటివా?
నే వెలుతురు జాడే చూడక
చీకటిలోనే ఉంటా!
నా తలపుల్లో నీవే అయితే?
నా వ్రాతల్లో, చేతల్లో
జ్యోతులు వెలిగించుకుంటా!
నీ హృదయాకాశంలో
నిండు జాబిలి నౌతా! 
నీ ఆలోంచనాంబర వీధిలో 
హరివిల్లు నౌతా! 
నీ మానస నందనోద్యానంలో 
ఆనందపు ఆమని నౌతా! 
నీ హేమంతపు సాయంత్రాన 
నులివెచ్చని స్పర్శ నౌతా! 
నా జీవన గమనంలో 
అందమైన అనుభవాలన్నీ
చెలీ!
నీకే అంకితమిచ్చుకుంటా!!
*********************************
.
కామెంట్‌లు